డ్వాక్రా సంఘాల సభ్యులకు2182.16 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్య నిర్దేశం
1 min read
సెర్ప్ సీఈవో కరుణ వాకాటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఏలూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 2182. 16 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని సెర్ప్ సీఈఓ కరుణ వాకాటి చెప్పారు.స్థానిక వట్లూరు లోని టిటిడిసి నందు మంగళవారం డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి కరుణ వాకాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణ వాకాటి మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల నిమిత్తం స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2182. 16 కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం జరుగుతుందన్నారు. దీనికోసం వార్షిక జీవనోపాధుల రుణ ప్రణాళిక సర్వే మరియు సూక్ష్మ రుణ ప్రణాళిక తయారీలో డ్వాక్రా సంఘ సభ్యులకు అవగాహన కలిగించడం, తదితర అంశాలపై అవగాహన కలిగించారు. రుణాలు పొందే డ్వాక్రా సంఘాల సూక్ష్మ రుణ ప్రణాళికలను ఈ నెలాఖరులోగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సూక్ష్మ రుణ ప్రణాళికల రూపకల్పన, లబ్ధిదారుల ఎంపికలో హార్టికల్చర్, ఫిషరీస్, పశు సంవర్ధక, పరిశ్రమల శాఖ మొదలగు శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో డ్వాక్రా సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, డ్వాక్రా సంఘాల మహిళలకు మంజూరుచేసిన రుణాలు 99 శాతానికి పైగా వసూలవుతున్నాయన్నారు. రుణాలు సద్వినియోగం చేసుకుని డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. . డి.ఆర్.డి. ఏ ప్రొజెక్ట్ డైరెక్టర్, డా.ఆర్. విజయరాజు, ప్రొజెక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రొజెక్ట్ మేనేజర్లు, ఎపియంలు, సీసీలు మరియు విఓఏ లు, తదితరులు హాజరు అయ్యారు.
