డ్వామా సిబ్బంది బదిలీలు
1 min read
సర్వీసును బట్టి కౌన్సిలింగ్ నిర్వహించిన పి.డి. వెంకట రమణయ్య
కర్నూలు :మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కర్నూలు జిల్లా పరిధిలో పనిచేయుచున్న ఉపాధి సిబ్బంది కేడర్ వారీగా ఏ. పి.డిలు, కోర్సు డైరెక్టర్లు, ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎం.టి.సిలు ప్లాంటేషన్ సూపర్ వైజర్స్ బదిలీలకు అర్హులైన వారి యొక్క సర్వీస్లను బట్టి ఆదివారం తన ఛాంబరులో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట రమణయ్య తెలిపారు. బదిలీల ప్రక్రియను ప్రాజేక్ట్ డైరెక్టర్, DWMA మరియు అడిషనాల్ పి.డి, DRDA వారు నిర్వహించారు.