ఆధునిక టెక్నాలజీతో ద్వారక హాస్పిటల్ నూతన భవనం
1 min read– జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..
– ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక ఆర్ఆర్ పేట కస్తూరిబా వారి వీధిలో ఆదివారం నూతనంగా నిర్మించిన ద్వారకా హాస్పిటల్ నూతన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. హాస్పటల్ యాజమాన్యం గంటా తారక రాజారామ్, (జనరల్ మరియు ఎండోస్కోపీ సర్జన్) కోవెలమూడి లక్ష్మీ , స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఎంతోమంది పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటూ సేవే పరమపదిగా గంటా తారక రాజారామ్ దంపతులు తాము ఎంచుకున్న వృత్తిలో వేలాదిమంది మన్ననలు అందుకున్నారు. నేడు వారి అందరి ఆశీస్సులు. దైవసంకల్పంతో నూతన భవనంలోకి అత్యాధునిక టెక్నాలజీ. సాంకేతికతతో మరిన్ని సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం , ఏలూరు శాసనసభ్యు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ తమ ఆహ్వానం మేరకు విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు నాణ్యత కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలన్నరు. ఆయన ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డాక్టర్ ఘంటా తారక రాజారామ్ దంపతులు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు అతిథులను పూర్ణకుంభ స్వాగతం పలికి సన్మానించి మెమొంటో అందజేశారు.