NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ పెద్దింటి అమ్మవారికి ద్వితీయావరణ పూజ, పుష్పాలంకరణ

1 min read

– దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా, కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానము నందు జాతర ఉత్సవములు మూడవ రోజు సందర్భముగా ఈరోజు ఉదయం గం.5.00 ల నుండి గం. 6:00 ల వరకు శ్రీ జలదుర్గ సమేత శ్రీ పెద్దింటి అమ్మవారికి ‘ద్వితీయావరణ పూజ, పుష్పాలంకరణ, ద్వితీయావరణ కలశ పూజ, ఖడ్గం పూజ, ధూపసేవ, నీరాజనం, బాలభోగము, మంత్ర పుష్పం, అనంతరం ఉచిత ప్రసాదం వితరణ జరిగినది. ఈ రోజు శ్రీ అమ్మవార్లకు వస్త్రాలంకరణ పుష్పాలంకరణ మరియు ఉచిత ప్రసాదం వితరణ చేసిన దాతలు కోళ్ళపర్రు వాస్తవ్యులు వారు శ్రీ కనుమూరి రంగరాజు, శ్రీమతి నాగ పార్వతిను ఆలయ అర్చకులు విశేష పూజలు జరిపించి శేష వస్త్రములతో వారిని సత్కరించరు. సాయంత్రం గం.4:00 లకు గుడివాడ వాస్తవ్యులు శ్రీ మురళి కృష్ణ కోలాట సమాజం చే కోలాట ప్రదర్శన, సాయంత్రం గం. 6.00 లకు పంచహారతులు మరియు రాత్రి గం.7.00 లకు కలిదిండి వాస్తవ్యులు శ్రీమతి B. గౌరి చే తిరుపతమ్మ తల్లి బుర్రకధ ప్రదర్శన జరుగయని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాలరావు ఒక ప్రకటనలో తెలియచేసినారు.

About Author