PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

E-commerce పండుగ ఆఫ‌ర్లు, ఫ్లాష్ సేల్స్ ..ఇక కుద‌ర‌దు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: దేశంలో ఈ-కామ‌ర్స్ సంస్థలు ఫ్లాష్ సేల్ రూపంలో వ‌స్తువులు, సేవ‌లు అమ్మడానికి వీలులేకుండా నిబంధ‌న విధించాల‌ని కేంద్ర వినియోగ‌దారుల వ్యవ‌హారాల శాఖ ప్రతిపాదించింది. ఈ- కామ‌ర్స్ సంస్థలు కొత్త ప‌ద్ధతుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న నేప‌థ్యంలో వినియోగ‌దారుల ర‌క్షణ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు ప్రతిపాదించింది.
వాటిలో ప‌లు కీల‌క సూచ‌న‌లు :

  • భార‌త్ లో ఈ-కామ‌ర్స్ వ్యాపారం చేయాల‌నుకునే సంస్థలు నిర్ధిష్ట స‌మ‌యంలోపు ప‌రిశ్రమ‌ల ప్రోత్సాహం, అంత‌ర్గత వాణిజ్య మండ‌లి వ‌ద్ద పేరు న‌మోదు చేసుకోవాల‌ని సూచించింది. ఈ రిజిష్ట్రేష‌న్ నంబ‌ర్ క‌స్టమ‌ర్లకు జారీ చేసే ఇన్వాయిస్ మీద ఖ‌చ్చితంగా ముద్రించాలి. ప్రతి సంస్థ త‌న లీగ‌ల్ పేరు, ప్రధాన కార్యాల‌యం, శాఖ‌ల వివ‌రాలు, వెబ్ సైట్ వివరాలు, ఈ మెయిల్, క‌స్టమ‌ర్ కేర్ వివ‌రాలు, ల్యాండ్ లైన్ , మొబైల్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు వెబ్ సైట్ లో పొందుప‌ర‌చాలి.
  • క‌స్టమ‌ర్లను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్రక‌ట‌న‌లు ఇవ్వకూడ‌దు. ఫిర్యాదుల ప‌రిష్కారానికి ప‌టిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  • ఫ్లాష్ సేల్స్ నిర్వహించ‌కూడ‌దు.
  • వినియోగ‌దారుల ర‌క్షణ చ‌ట్టంలోని నిబంధ‌న‌లు అములు చేసేందుకు చీఫ్ కాంప్లియ‌న్స్ అధికారిని నియ‌మించాలి.
  • విదేశీ వ‌స్తువులు అమ్మేట‌ప్పడు.. ఆ వ‌స్తువు ఎవ‌రి వద్ద నుంచి కొన్నారు ?. ఎవ‌రు అమ్ముతున్నారు ?. ఎక్కడి నుంచి దిగుమ‌తి చేసుకున్నారు ? వ‌ంటి వివ‌రాలు పొందుపర‌చాలి.
  • మార్కెటింగ్ లో బ‌లంగా ఉన్న సంస్థలు త‌మ స్థాయిని దుర్వినియోగం చేసుకోకూడ‌దు.
  • ఏ సంస్థా త‌మ ఉత్పత్తుల గురించి రివ్యూ పోస్టులు పెట్టకూడ‌దు.

About Author