ఈ-కామర్స్ రూల్స్.. ప్రధానికి కాయిట్ లేఖ
1 min readపల్లెవెలుగు వెబ్ : ఈ-కామర్స్ సంస్థల కోసం రూపొందించిన ముసాయిదా నిబంధనల విషయంలో వెనక్కి తగ్గొద్దని దేశీయ వర్తక సంఘం కాయిట్ కేంద్రాన్ని కోరింది. విదేశీ సంస్థల నిధులతో నడుస్తున్న ఈ-కామర్స్ సంస్థల ఒత్తిళ్లకు లొంగొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ- కామర్స్ సంస్థలు .. నూతన నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న వేళ కాయిట్ ప్రధానికి లేఖ రాసింది. ముసాయిదా నిబంధనల పై వచ్చిన సలహాలు, సూచనలు పరిశీలించి వెంటనే నోటిఫై చేయాలని కోరింది. ఈ – కామర్స్ సంస్థల అనైతిక ధోరణితో పెద్ద మొత్తంలో వ్యాపార సంస్థలు దేశ వ్యాప్తంగా మూతపడ్డాయని స్పష్టం చేసింది.