మార్కెట్లోకి ఈ- రూపాయి
1 min readపల్లె వెలుగు వెబ్ : ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఈ-రూపాయి మార్కెట్లోకి వస్తోంది. ఈ-రూపీ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. బ్యాంకు అకౌంట్లు, యాప్ లు, కార్డులతో సంబంధం లేకుండా .. నగదు రహిత, కాంటాక్ట్ లెస్ లావాదేవీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ-రూపీని ఏ ఉద్దేశంతో తీసుకుంటారో అదే ఉద్దేశం కొరకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇతర చెల్లింపులకు అది పనికిరాదు. ప్రభుత్వం సబ్సీడీల రూపంలో నగదు అందజేస్తున్న పలు పథకాలకు క్రమంగా ఈ-రూపీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వార వృథా, దుర్వినియోగం అరికట్టవచ్చనేది కేంద్రం అభిప్రాయం. ఉదాహరణకు ఎరువుల దుకాణాలు ప్రభుత్వ సబ్సీడీని తగ్గించి రైతులకు ఎరువుల బస్తాలు రైతులకు విక్రయిస్తున్నారు. ఇక పై ఆ సబ్సీడీని ఈ-రూపీ వోచర్ల రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు పంపే అవకాశం ఉంది.