ఈఏపీసెట్-2022 దరఖాస్తు గడువు పెంపు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2022కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఏకంగా మూడు లక్షలకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ప్రిల్ 11న సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 10 వరకు ద రఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చారు. ఆ తరువా త ఆలస్య రుసుము రూ.500తో జూన్ 20 వరకు, రూ.1,000తో జూన్ 25 వరకు, రూ.5,000తో జూ లై 1వరకు, రూ.10,000తో జూలె 3వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు గడువుగా నిర్ణయించారు. ఇక ఆలస్య రుసుము లేకుండా నిర్ణయించిన గడువు మే 10 నాటికి 2,74,260 దరఖాస్తులు దాఖలయ్యాయి.