NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :   ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అక్రమ ప్రవేశాలు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శు విజేంద్ర డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సీపీఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా ఆయా యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ, వారిచ్చే కాసులకు కక్కుర్తిపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యథేచ్ఛగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నా అధికారులు వారిని ప్రశ్నించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంత జరుగుతున్నా హెచ్చరికలుసంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా ముందస్తు ప్రవేశాలను ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా నగరంలో భారీ హార్డింగ్లు, రంగురంగుల కరపత్రాలతో విద్యా సంస్థల యాజమాన్యాలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి, ఎరవేసి తమ వైపు ఆకర్షింపజేసుకొంటున్నారని తెలిపారు. తమ విద్యాసంస్థలో నాణ్యమైన విద్య అందిస్తామని చెబుతూ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారన్నారు. అక్రమ ప్రవేశాలను అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులుచేయకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పంధించి నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా విద్యాసంస్థల ముందు ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు అబ్దుల్ ఖాదర్,దస్తగిరి సమీర్, కాజా  పాల్గొన్నారు.

About Author