PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా నరేన్ రామాంజనేయులు రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు చితకొమ్మదిన్నె జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, వైఎస్ఆర్సిపి యువ నాయకులు పెడబల్లె ప్రదీప్ కుమార్ రెడ్డి, నిత్య పూజయ్య ఆధ్వర్యంలో శనివారం స్థానిక 16వ వార్డు సరస్వతి నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో నరేన్ బర్త్ డే కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి తనయులు పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వైయస్సార్సీపి యువత పెద్ద ఎత్తున ఆయన జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు, అందులో భాగంగానే 16వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో పోలిక వసతులలో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి, బీరువా ,గ్యాస్ స్టవ్, వంట పాత్రలు అందివ్వడం జరిగిందన్నారు, అలాగే మండల వ్యాప్తంగా ఆయన జన్మదిన ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ రమాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగరత్నమ్మ, వైఎస్ఆర్సిపి నాయకులు కృష్ణ, అన్నమయ్య, రమేష్, కిట్టు, ఉదయ్ కుమార్, సిసింద్రీ, పవన్ కుమార్ రెడ్డి, అంగన్వాడి కార్యకర్తలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author