PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జీనియస్ గ్లోబల్ స్కూల్లో ముందస్తుగా హోలీ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్లలో ఉన్నటువంటి జీనియస్ గ్లోబల్ స్కూల్లో ముందస్తూగా హోలీ వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.అనంతరం స్కూల్ కరస్పాండెంట్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ హోలీ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి.ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. స్కూల్లో పిల్లలు చేత హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించిన్నారు.ఈవేడుకలును పిల్లలు చాల సంతోషంతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ గంగాధర్ రెడ్డి, డీన్ సతీష్ చంద్ర, ప్రిన్సిపాల్ ముల్లా జైబ భక్తియ,ఏఓ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

About Author