ముందస్తు సంక్రాంతి సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండల కేంద్రం రుద్రవరం గ్రామపంచాయతీ మజర గ్రామం తువ్వపల్లె తిప్పపై ఉన్న ఆదర్శ పాఠశాల నందు ప్రిన్సిపాల్ నాగేశ్వర రావు అధ్యక్షతన కో ఆర్డినేటర్లు చవాన్,విజయలక్ష్మి,అనురాధ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు. ఒకరికొకరు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని తెలిపారు. ముందుగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమం నందు వైస్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి అంటే అచ్చమైన పల్లె పండుగ అన్నారు. మనవైన సంప్రదాయాలు, సంస్కృతుల్ని ప్రతిబింబించే సప్తవర్ణాల వేడుక అని మనుషులు, మూగజీవాల మధ్య ఉండే అనురాగాలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి పర్వదినం అని తెలిపారు. నేటి నుండి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కావడంతో పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడంతో విద్యార్థులకు సరికొత్త అనుభూతుల్ని కల్పించినట్లు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం నందు ఉపాధ్యాయ బృందం నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.