10 వేల సంపాదన.. పిల్లను ఇచ్చేందుకు వెనకడుగు !
1 min readపల్లెవెలుగు వెబ్ : అతి సామాన్య స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వారిలో పేటీఎం అధినేత విజయశేఖర శర్మ. పేటీఎం ఐపీవోగా పబ్లిక్ ఇష్యూకి వచ్చి స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయింది. ఈ సందర్భంగా విజయ శేఖర శర్మ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 27 ఏళ్ల వయసులోనే ఓ సంస్థను స్థాపించి.. మొబైల్ కంటెంట్ విక్రయించడం మొదలుపెట్టినట్టు ఆయన చెప్పారు. ఆ సమయంలో కేవలం 10 వేలు మాత్రమే ఆదాయం వచ్చినట్టు ఆయన చెప్పారు. ఈ విషయం తెలుసుకుని పిల్లనిచ్చేందుకు కూడ ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అలా తన కుటుంబానికి అర్హత లేని బ్యాచిలర్ గా మారానని తెలిపారు. దీంతో కంపెనీ మూసేసి 30 వేల జీతం వచ్చే ఉద్యోగం చూసుకోమని తన తండ్రి చెప్పినట్టు ఆయన అన్నారు.