PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూట్యూబ్ తో నెల‌కు 4 ల‌క్ష‌లు సంపాదిస్తున్నా !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యూ ట్యూబ్ ద్వార త‌న‌కు నెల‌కు 4 ల‌క్షల ఆదాయం వ‌స్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కారి తెలిపారు. క‌రోన స‌మ‌యంలో ఇంట్లో ఉండి వంట చేసిన వీడియోలు, ఉప‌న్యాసాలు ఇచ్చిన వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాన‌ని తెలిపారు. ఆ వీడియోల‌కు వీక్షకులు పెర‌గ‌డంతో యూట్యూబ్ త‌న‌కు రాయ‌ల్టీగా 4 ల‌క్షలు ఇస్తున్నట్టు ఆయ‌న చెప్పారు. లాక్ డౌన్ స‌మ‌యంలో తాను ఇంట్లో ఉండి ల‌క్షల రూపాయ‌లు సంపాదించాన‌ని తెలిపారు. గుజ‌రాత్ లోని భ‌రూచ్ లో ముంబ‌యి- ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే పనుల పురోగ‌తిపై స‌మీక్షించిన సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు.

About Author