ఇయర్ ఫోన్స్ పేలాయి.. యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి
1 min read
పల్లె వెలుగు వెబ్ : బ్లాటూత్ ఇయర్ ఫోన్స్ పేలి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా చౌమూలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతుడు ఉదయపుర గ్రామానికి చెందిన రాకేశ్ నాగర్ గా గుర్తించారు. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని మాట్లాడుతున్న సమయంలో అవి పేలాయి. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇయర్ ఫోన్స్ పేలిన సమయంలో రాకేశ్ కి గుండెపోటు వచ్చిందని, ఆ కారణంగానే అతడు చనిపోయాడని వైద్యులు భావిస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారిగా వైద్యులు పేర్కొన్నారు.