భూకంపం.. పేక మేడల్లా కూలిన భవనాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : భూకంపాలకు నిలయంగా మారిన ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారు జామున మరోమారు భూమి కంపించింది. ఈసారి భారీ స్థాయిలో రిక్టార్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8.43 గంటల ప్రాంతంలో లుజోన్ ద్వీపంలోని ఆబ్రా ప్రావిన్స్‌ను భూకంపం తాకినట్లు పేర్కొంది. మనీలాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎత్తైన భవనాలు కుదుపులకు లోనయ్యాయి. కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు పెటుడుతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.