NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ‌ప‌ట్నంలో భూ ప్రకంప‌న‌లు.. ఇళ్ల నుంచి జ‌నం ప‌రుగులు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : విశాఖ‌ప‌ట్నంలో ప‌లు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంప‌న‌లు వ‌చ్చాయి. అక్కయ్య పాలెం, మధురాన‌గ‌ర్, బీచ్ రోడ్డు, తాటిచెట్ల పాలెం, అల్లిపురం, ఆసిల్ మెట్ట, సీత‌మ్మధార‌, గురుద్వార‌, రైల్వే స్టేష‌న్, బీచ్ రోడ్డు, హెచ్ బీ కాల‌నీ, జ్ఞానాపురం, బంగార‌మ్మ మెట్ట, సింహాచ‌లం, అడ‌వివ‌రం, గోపాల‌ప‌ట్నం ప్రాంతాల్లో భూమి కొన్నిసెక‌న్ల పాటు కంపించింది. విశాఖ ఓల్డ్ టౌన్ తో పాటు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో భారీ శ‌బ్దంతో ఉద‌యం 7.15 నిమిషాల స‌మయంలో భూమి కంపించింద‌ని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంప‌న‌లు రావ‌డంతో స్థానికులు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. శాంతిపురం ఎన్జీవోస్ కాల‌నీలో భవ‌నం శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి.

About Author