NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తూర్పు రాయలసీమ.. ఆపస్ అభ్యర్థిగా కె. బ్రహ్మానందం

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: రానున్న శాసనమండలి ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నుండి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున కావలికి చెందిన శ్రీ కె.బ్రహ్మానందం గారు పోటీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రావణ్ కుమార్, ఎస్ బాలాజీలు తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, జవహార్ భారతి కళాశాలలో లెక్చరర్ గా పనిచేయుచున్న శ్రీ బ్రహ్మానందం గారికి అపస్ తరపున ఈ అవకాశం కల్పించినట్లు వారు తెలిపారు. శ్రీ కే బ్రహ్మానందం గారువిద్యార్థి దశ నుంచి ఏబీవీపీ కావలి పట్టణ శాఖ అధ్యక్షులుగా, రాష్ట్ర కార్యవర్గంలోను పని చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందంమాట్లాడుతూఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉందనిఉపాధ్యాయులకు ప్రత్యేక పిఆర్సి ఇవ్వాలని వారి తరఫున పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని వారు తెలిపారు. సీహెచ్.శ్రావణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఎస్ బాలాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

About Author