గడ్డి తిని బతకాలా..!
1 min readఅంగన్వాడీల ఆవేదన….
చాగలమర్రి , పల్లెవెలుగు: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 27 రోజులుగా దీక్ష శిబిరాలలో నిరవధిక సమ్మె చేస్తుండగా ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిరసనగా పచ్చ గడ్డి తింటూ నిరసన తెలిపారు. చాలీచాలని జీతాలతో బ్రతుకు జీవనం సాగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ లతో ఒత్తిడికి గురవుతూ ఉన్న మాపై కనికరము చూపకుండా ఎస్మా చట్టం ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేయడం సబబు కాదన్నారు. ఇలాంటి పరిస్థితులలో మేము గడ్డి తిని బ్రతకాలా? అంటూ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా నిలబడి పచ్చ గడ్డి తిన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ, సిపిఎం నాయకుడు గుత్తి నరసింహుడు, హసీనా, ఇందుమతి, సుజాత, గుర్రమ్మ, మేరీ, జ్యోతి, సిఐటియు నాయకురాలు సంజీవమ్మ, రామసుబ్బమ్మ, నాగమణి, వివిధ గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి సహాయకులు పాల్గొన్నారు.