PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉల్లిగడ్డ కారం తిని బ్రతుకుతా..!

1 min read

– అవినీతికి తలవంచను..నేను పోలీసు అధికారినే
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను కొనాలని చూశారు..
– తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
– ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వాఖ్యలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉల్లిగడ్డ కారమైన తిని బతుకుతా కానీ అవినీతికి తలవంచను ఈ శ్వాస ఉన్నంత వరకు వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.మంగళవారం నందికొట్కూరు పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై వచ్చిన ఆరోపణలపై కీలక వాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ఈ నెల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను కూడా డబ్బు ఎర చూపి కొనాలని ప్రయత్నించారన్నారు.కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. వారు ఎవరో నాకు తెలుసు కానీ వారి పేరు చెప్పుకోవడం నాకు అవసరం లేదు.వారికి నేను ఒకటే చెప్పిన నా ముందు వంద కోట్లు ఒక పక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఒక్క పక్క పెట్టి ఏది కావాలని అడుగుతే నేను సీఎం జగన్ ఫోటో కావాలి అని చెపుతానన్నారు. నాకు 1982 లో మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతుకును ఇచ్చారు. ఆ కుటుంబానికి నా శ్వాస ఉన్నంత వరకు రుణపడి ఉంటానని తెలిపారు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్ ను మోసం చేస్తానని ఎలా అనుకుంటారని తిట్టి పంపించానని వివరించారు.నేను తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు . ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడకుంటే దైర్యంగా సీఎం ను ప్రశ్నించ వచ్చును కదా అని ప్రశ్నించారు. ఆమె మా టీమ్ లోని సభ్యురాలు. 21 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆమె ఓటు వేయడానికి వస్తుండగా టీడీపీ నేత రామానాయుడు ఆమెను చూసి మా డిసైడ్ ప్యాక్టర్ వస్తున్నారని అన్నారన్నారు.అందుకు అందుకు ప్రత్యక్ష సాక్షులు మేమున్నామని తెలిపారు. మరుసటిరోజు ఆమె అసెంబ్లీ సమావేశాలకు రాలేదు.22మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఓటు వేసింది తెలుసుకోవడానికి కష్టమేమి కాదన్నారు. మొన్నటి వరకు జగన్ ను దేవుడు అని పొగిడిన మీరూ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.నాలుగు సంవత్సరాల నుంచి ఇంద్రుడు చంద్రుడు అని పొగడిన వాళ్ళు సీఎం జగన్ ను దూషించడం చాలా బాధగా ఉండదన్నారు. నీవు వైసీపీకి ఓటు వేశాను అని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మీరు ఎవరికి ఓటు వేశారో ఆ దేవుడికి మీ ఆంతరాత్మకు తెలుసన్నారు .తప్పు జరిగి ఉంటే జగన్ కు క్షమాపణలు చెప్పుకోండి అని ఒక సోదరుడుగా సలహా ఇస్తున్నానన్నారు.నేను ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడుతా కానీ అబద్ధాలు ఎప్పుడు మాట్లాడను. మీరు ఒక ప్రజా ప్రతినిధి గా ఉండి పోలీసులను ఎలా బెదిరించారో మీ నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు .నేను ఒక పోలీసు అధికారినే. ప్రజా ప్రతినిధులు అయినంత మాత్రనా పోలీసులను అవమానిస్తారా.. పోలీసులు ఎవరి కాళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని తెలుసుకోండి అని హితవు పలికారు.సమావేశంలో వైసీపీ రాష్ట్ర నాయకులు చెరుకు చెర్ల రఘు రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల మహబూబ్ రబ్బానీ, కౌన్సెలర్లు ఉండవల్లి ధర్మా రెడ్డి, మొల్ల జాకీర్ హుసేన్, సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య, వైసీపీ ఎస్సి విభాగం జిల్లా అధ్యక్షుడు సగినేల వెంకట రమణ, ఎస్సి ఎస్టీ సెల్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్. దిలీప్, వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, పేరుమాళ్ళ జాన్, తాటిపాటి అయ్యన్న, కదిరి సుబ్బన్న ,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author