PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇవి తినండి.. ఇమ్యూనిటీ పెంచుకోండి : కేంద్రం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: శ‌రీరంలో రోగనిరోధ‌క‌ శ‌క్తి పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప‌లు ఆహార ప‌దార్థాల‌ను సూచించింది. mygovindia ట్విట్టర్ ఖాతా ద్వార పలు ర‌కాల డైట్ ను సూచించింది. వీటిని తీసుకోవ‌డం ద్వార శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని తెలిపింది.

  • రాగులు, ఓట్లు, అమ‌రంత్ లాంటి తృణ‌ధాన్యాలు తీసుకోవాలి.
  • ప్రోటీన్లు అధికంగా ల‌భించే చికెన్, గుడ్లు, చేప‌లు, ప‌నీర్, కాయ‌ధాన్యాలు, గింజ‌లు తీసుకోవాలి.
  • ఆరోగ్యక‌ర‌మైన కొవ్వు ప‌దార్థాలు క‌లిగిన వాల్ న‌ట్, బాదామ్, ఆలివ్ నూనె, ఆవ నూనె తీసుకోవాలి.
  • శ‌రీరానికి త‌గిన విట‌మిన్లు, పండ్లు అందించే కూర‌గాయ‌లు, పండ్లు తీసుకోవాలి.
  • ఆందోళ‌న త‌గ్గించేందుకు 70 శాతం కోకో మిశ్రమంతో త‌యారైన డార్క్ చాక్లెట్స్ త‌క్కువ తీసుకోవాలి.
  • ప‌సుపు క‌లిపిన పాలు ప్రతిరోజు తీసుకోవాలి.
  • రోజులో అప్పుడ‌ప్పుడు సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి.
  • ప్రతి రోజు త‌ప్పకుండా వ్యాయామం చేస్తూ.. శ్వాస సంబంధ‌మైన టిప్స్ పాటిస్తే మంచిద‌ని కేంద్రం సూచించింది.

About Author