అరుదైన వ్యాధితో వెంట్రుకలు తినేది.. ఆమె కడుపులో 2 కిలోల జుట్టు !
1 min readపల్లె వెలుగు వెబ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఓ బాలిక ట్రైకోబెజోవర్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉండేది. వాంతులు, కడుపు నొప్పి సమస్యతో ఆస్పత్రికి వెళ్లింది. బాలిక పొత్తి కడుపు పై భాగంలో పెద్ద వాపు కణపడటంతో ఎక్స్ రే, సీటీస్కాన్, ఎండోస్కోపీ చేయగా.. లోపల జుట్టు ఉందని తేలింది. బాలికకు శస్త్ర చికిత్స చేసి 2 కిలోల వెంట్రుకలు బయటికి తీశారు. ట్రైకోబెజోవర్ అనే వ్యాధితో బాధపడుతూ ఆమె తరుచూ వెంట్రుకలు తినేది. దీంతో కడపులోపల వెంట్రుకలు బంతిలా పేరుకుపోయాయని వైద్యులు చెప్పారు. జుట్టు కడుపులో చేరడం వల్ల 32 కిలోలు బరువు తగ్గి ఆ బాలిక బలహీనపడిందని వైద్యులు చెప్పారు. డిప్రెషన్, మానసిక సమస్యతో జుట్టు తింటారని, ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తామని డాక్టర్ సమద్దర్ తెలిపారు.