పచ్చళ్లు ఎక్కువగా తింటే మగవారికి ఇబ్బందేనట !
1 min readపల్లెవెలుగువెబ్ : రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్‌లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.