తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలకు మోగిన నగారా
1 min read
పల్లెవెలుగు వెబ్: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో 3, తెలంగాణలో 6, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. 29న పోలింగ్.. అదే రోజు ఫలితాల లెక్కింపు ఉంటుంది. ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు, తెలంగాణలో జూన్ 3వ తేదీన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే కరోనా విజృంభణతో ఎన్నికల నిర్వహణను ఈసీ… గతంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల వివరాలు
నోటిఫికేషన్: నవంబరు 9
నామినేషన్ల దాఖలుకు తుది గడువు: నవంబరు 16
నామినేషన్ల పరిశీలన: నవంబరు 17
నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ: నవంబరు 22
పోలింగ్: నవంబరు 29
ఓట్ల లెక్కింపు: నవంబరు 29