NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ రహిత బ్యాగులు వాడాలి :ఇంతియాజ్​ బాష ఐఏఎస్​

1 min read

పల్లెవెలుగు వెబ్​:  పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు సెర్ఫ్​ ముఖ్య కార్య నిర్వహణాధికారి, ఐఏఎస్​ ఇంతియాజ్​ బాష. శుక్రవారం నగరంలోని  ఎన్​ఆర్​ పేట క్యాంపు కార్యాలయంలో కోడుమూరు మహిళ మార్ట్ ను ఉద్దేశించి ఐఏఎస్​ ఇంతియాజ్​ బాష  మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని,  వినియోగదారులు సరుకులు తీసుకొని పోవడానికి పర్యవరణ రహీత బ్యాగులు వాడాలని, సెర్ప్ ద్వారా పర్యావరణ రహీత బ్యాగులను కోడుమూరు మార్ట్ సభ్యులకు అందజేయడం జరిగినది. కోడుమూరు మహిళ మార్ట్ ను ప్రోత్సహిస్తూ ప్యాకింగ్ మెషినరీ త్వరలో అందజేయడం జరుగుతుంది అని, ఇతర జిల్లాలనుంచి కాజు, బాదం, చింతపండు మొదలగు  ఉత్పత్తులను దిగుమతి చేసుకొని మార్ట్ ను లాభసాటిగా మహిళలు నడిపించాలని తెలియజేశారు. కోడుమూరు మహిళ మార్ట్ యొక్క సేల్స్ గురుంచి అరా తీయడం జరిగినది. సేల్స్ పెరగడానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో పథక సంచాలకులు డిఆర్డీఏ వైకెపి  వెంకట సుబ్బయ్య, ఎపిడి శ్రీధర్ రావు,  నర్సమ్మ, ఎపియం కోడుమూరు పుష్పవతి, కోడుమూరు మహిళ మార్ట్ సభ్యులు మరియు మహిళలు  పాల్గొన్నారు.

About Author