ఈడీ, బోడీ అంటే లంగలు, దొంగలు బయపడతారు… నేను కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై ఈడీ కేసులు పెడతానంటే భయపడబోనని సీఎం కేసీఆర్ అన్నారు. దొంగలు, లంగలు భయపడతారు తప్ప.. ధర్మంగా, నిజాయితీగా ఉన్నోళ్లు, ప్రజల సంక్షేమం కోరేవారు భయపడబోరని చెప్పారు. ‘‘ఈడీ, బోడీయే కాదు మోదీ.. ఏం పీక్కుంటవో పీక్కో’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీకి సవాల్ చేశారు. మోదీ తనను గోకినా, గోకకపోయినా.. తాను మాత్రం ఆయనను గోకుతానని ప్రకటించారు. ఈ దేశం ఎవడి అయ్య సొత్తు కాదని, ఇది రాచరిక వ్యవస్థ కాదని, మోదీ గూండాగిరి, మోసకారి విషయాలు నడవవని, ప్రజల్నే బెదిరిస్తామంటే కుదరదని హెచ్చరించారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడులో శనివారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంపై, ప్రధాని మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.