PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరుతడి పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించండి

1 min read

– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశంలో జిల్లాలోని రైతులు ఆరుతడి పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యసంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ సలహా మండలి  అధికారులతో   జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగం ఆరుతడి పంటలు వేసేలా క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.మనము నీరు అందించ లేనప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. జిల్లాలో రైతాంగం పండించిన కొర్రలు, రాగులు, జొన్నలు, కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ డీఎంను ఆదేశించారు. కౌలు రైతులకు సిసిఆర్ కార్డ్స్ దాదాపు 18 వేల మందికి ఇచ్చారని ఇందులో కేవలం 374 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయని మిగతా కౌలు రైతులకు కూడా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలోని రైతుల అనుమానాలను నివృత్తి చేసుకొనుటకు ప్రతి రైతు భరోసా కేంద్రంలో అధికారుల ఫోన్ నెంబర్లను డిస్ప్లే బోర్డులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.రైతులకు అందించే నష్టపరిహారాలు రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించాలన్నారు. కాలేజీలలోని మధ్యాహ్న భోజన పథకం కొరకు సరఫరా చేసే రైస్ నాణ్యతతో ఉండేలా సరఫరా చేయాలని సివిల్ సప్లై డిఎం ను కోరారు.వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలోని 26 మండలాల్లో 24 మండలాలను కరువు ప్రాంతం మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని మిగిలిన కర్నూల్ రూరల్. తుగ్గలి మండలాలను కూడా కరువు మండలంగా ప్రకటించాలని రైతులు కోరారని, అందుకొరకు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాలో ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయడం జరిగిందని, కానీ కొంతమంది రైతులు అందుబాటులో లేనందున ఈకేవైసి చేయలేదన్నారు. కానీ ఈకేవైసి చేయని రైతులను కూడా నష్టపరిహార జాబితాలో చేర్చాలని రైతులు కోరుతున్నారని తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పురుగు మందులు, రసాయనికి ఎరువులు సరఫరా చేస్తున్నామని, కానీ రైతులు 50% సబ్సిడీ కావాలని కోరుతున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ SE రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఉమాదేవి, ఆర్టికల్చర్ అధికారి రామాంజనేయులు సివిల్ సప్లై డి ఎం షర్మిల, డి.ఎస్.ఓ ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author