క్రీడల వల్ల విద్యా.. ఉద్యోగ అవకాశాలు
1 min read– మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి.
– అట్టహాసంగా ప్రారంభమైన నందికొట్కూరు నియోజకవర్గం స్థాయి ఎస్.జి.ఎఫ్ సెలక్షన్స్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17..14 (బాల & బాలికల)సెలక్షన్స్ నందికొట్కూరు లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి 600 మంది క్రీడాకారులు 70 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ సెలక్షన్స్ కు హాజరయ్యారు. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ మురళీకృష్ణ రెడ్డి ,కొత్తపల్లి జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలను లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామి రెడ్డి సభా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు ప్రాంతం క్రీడలకు పుట్టినిల్లు అని ఈ ప్రాంతం నుండి ఎంతోమంది రాష్ట్ర ,జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యారన్నారు. గత సంక్రాంతి పండుగ సందర్భంగా జగనన్న క్రీడా సంబరాలు పేరుతో ఇదే గ్రౌండ్ లో ఎంతో అట్టహాసంగా క్రీడలు నిర్వహించామన్నారు. క్రీడల్లో సాధించిన సర్టిఫికెట్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నంద్యాల జిల్లా ఎస్జిఎఫ్ నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా వైస్ చైర్మన్ ప్రశాంతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రహత్, కౌన్సిలర్లు రూపా దేవి,చిన్నరాజు, లాలూ ప్రసాద్,రవూఫ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉస్మాన్ భేగ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జలీల్ భాషా, నందికొట్కూరు తహసిల్దారు రాజశేఖర్ బాబు, నంద్యాల జిల్లా శాప కో-ఆర్డినేటర్ రవికుమార్, నంది కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, నందికొట్కూర్ మిడుతూరు మండల విద్యాశాఖ అధికారులు ఫైజున్నిసా బేగం, శ్రీనాథ్, వైయస్సార్సీపి నాయకులు జబ్బార్, పబ్బతి రవి, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ రెడ్డి, వి.ఆర్ శ్రీను,రమేష్ ,రిటైర్డ్ వ్యాయామ ఉపాద్యాయులు శంకర్ రెడ్డి శ్రీధర్, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు ఆర్టీసీ బాబు తదితరులు హాజరయ్యారు.అనంతరం క్రీడలకు సహాయ సహకారాలు అందించిన ఉస్మాన్ బేగకు, జలీల్ భాషా కు నిర్వాహక కమిటీ వారు ఘనంగా సన్మానించారు. సాయంకాలం జరిగిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో విజేతలకు పాఠశాలప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి, నంద్యాల జిల్లా షాప్ కోఆర్డినేటర్ రవికుమార్ లు ట్రోఫీ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ డోరతి, మండల కోఆర్డినేటర్లు వీరన్న, శ్రీనివాసులు, నాగరాజు, మురళి నాయక్, కృష్ణ, వెంకటేశ్వర్లు మరియు ఫిజికల్ డైరెక్టర్లు జెసింతాదేవి, జయమ్మ, విజయ కుమారి, సుమలత, రాజేశ్వరి, చెన్నమ్మ, చంద్రమోహన్ చంద్రశేఖర్, కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.