చదువుతోనే.. భవిత : ఇన్కం ట్యాక్స్ హైదరాబాద్ జోన్ జేడీ
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: చదువుతోనే భవిష్యత్తు ఉంటుందని ఇన్కమ్ టాక్స్ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ఐ ఆర్ ఎస్ యాదగిరి అన్నారు. పెద్దపాడు సమీపంలో జరిగిన కురువల కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏంకే. రంగస్వామి అధ్యకతన జరిగిన కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి యాదగిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించాలని, సమాజాన్ని తీర్చిదిద్దే నాయకులను తయారు చేయాలన్నారు. కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వశికేరి లింగమూర్తి, జిల్లా అధ్యక్షులు పెద్దహరివణం దేవేంద్రప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలో కురువలకు ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో 6 లక్షల కురువ జనాభా ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన కురువలు అధిక సంఖ్యలో ఉన్నా రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రాష్టంలోనే సర్పంచ్, ఎంపిటీసీల తో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలలో కురువలు అధిక సంఖ్యలో గెలిచిన విషయాన్ని ఆయా రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. భవిష్యత్తులో కురువలను గుర్తుంచిన పార్టీలకే తాము మద్దతిస్తామన్నారు. కురువలంతా ఐక్యమత్యంతో ఉండాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు రిటైర్డ్ ఎమ్మార్వో క్రిష్టన్న, సంఘం ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల సుంకన్న, కోశాధికారి కేసి నాగన్న, నగర అధ్యక్ష కార్యదర్శులు తవుడు శీను, వెంకట కృష్ణ, రామకృష్ణ, బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ ,మాజీ జడ్పీటీసీ ప్ .శ్రీనివాసులు, అనంతపురం జిల్లా కురువ సంఘం అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు, నాయకులు వసీకేరి శివ, బ్యాళ్ల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.