బిజెపి నేతల దృష్టికి విద్యాశాఖ సమస్యలు…ఆపస్
1 min read
ఏలూరు, న్యూస నేడు: ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖ లో నెలకొన్న సమస్యలు,ఇబ్బందుల గురించి ముఖ్యంగా తెలుగు మీడియం సమాంతరంగా కొనసాగించాలని, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండో సెక్షన్ గా పరిగణించి ఆ తర్వాత ప్రతి 30 మందికి అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాలని, మిగులు ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలల్లో క్లస్టర్ స్కూల్స్ లో నియమించడం సరికాదని, రాష్ట్రవ్యాప్తంగా మూడంచెల పాఠశాల వ్యవస్థ మాత్రమే కొనసాగించాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 20 మందికి ఒక ఉపాధ్యాయుని కేటాయించాలని, మోడల్ ప్రైమరీ స్కూల్స్ కు పిఎస్ హెచ్ఎంలుగా ఎస్ జి టి లకు ప్రమోషన్లు ఇచ్చి పంపాలని తదితర డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు యస్ బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ వీ సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ లు నేడు విజయవాడలో కూటమి ప్రభుత్వంలో భాగమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ని, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ యన్ మధుకర్ ని కలిసి వినతి పత్రాలు ఇచ్చి కోరడం జరిగింది. ఇంకా హై స్కూల్ ప్లస్ లను కొనసాగిస్తూ ఖాళీగా ఉన్న పీజీటీ స్థానాలను స్కూల్ అసిస్టెంట్ లను నియమించాలని, రెగ్యులర్ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలని , ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు తగిన కృషి చేయాలని కోరడం జరిగింది.బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ మధుకర్ స్పందిస్తూ త్వరలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశం ఏర్పాటు చేస్తామని, తాము కూడా త్వరగా చొరవ తీసుకొని తీసుకొని విద్యాశాఖలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
