విద్య అనేది సమాజంలో చూసే రుగ్మతలకు పారద్రోలే దివ్య ఔషధం
1 min read
విద్యార్థులు సంపూర్ణమైన వికాసం కోసమే తల్లితండ్రులు, ఉపాధ్యాయల ఆత్మీయ సమావేశాలు
జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు మండలం తాళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మెగా పేరెంటు మీట్ సమావేశంకు జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ప్రతి క్లాసు రూమ్ కి వెళ్ళి విద్యార్థులతో మమేకం అయ్యారు.పేరెంట్స్, ఉపాధ్యాయులు సమక్షంలో విద్యార్థులు ప్రతిభను పరిశీలించారు.వంటశాలకు వెళ్ళి ఈరోజు ఏమి వండారు, మెనూ ప్రకారం ప్రతి రోజు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.సన్న బియ్యంతో వంటలు వండుతున్నారా స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు రాగిజావను జిల్లా జాయింటు కలెక్టరు అందించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పట్ల అవగాహన కల్పించి, భావిభారత పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను,నాయకత్వ లక్షణాలను దగ్గర ఉండి చూసే వ్యక్తి ఉపాధ్యాయులు కనుక మరింత బాధ్యతను తీసుకోవాలని అన్నారు. పేరెంటు మీట్ సమావేశంలో విద్యార్థుల తల్లితండ్రులతో ఉపాధ్యాయులు నేరుగా మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం,అందులో తనను భాగస్వామ్యం చెయ్యడం ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలుగ చేసిందని అన్నారు. పిల్లలకి పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువలు సయితం తెలియ చెయ్యాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుపై ఉందని స్పష్టం చేశారు.భవిష్యత్తు తరాలను చక్కగా తీర్చిదిద్దే అవకాశం మన చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.నేడు పాఠ్య పుస్తకాలు,షూస్,బ్యాగ్, స్కూల్ డ్రెస్ వరకు అన్ని సమకూర్చడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశంలో యువత పాత్ర కీలకం అని,వారిని అప్రమత్తగా ఎదిగేలా చూడాలని జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఏ.కృష్ణజ్యోతి,మండల విద్యాశాఖ అధికారి సబ్బిత నరసింహామూర్తి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.