చదువుతో పాటు విద్య బుద్ధులు నేర్చుకోవాలి.. ఎస్ఐ
1 min readఘనంగా శ్రీ విద్య పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: ప్రతి బాల బాలికలు చదువుతోపాటు విద్యాబుద్ధులు నేర్చుకోవాలని గురువులను తల్లిదండ్రులను గౌరవించుకోవాలని స్నేహితుల దగ్గర నడవడిక నేర్చుకోవాలని ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. బాలల దినోత్సవ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సై నాగర్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ల గురించి సూచించారు. సమాజంలో చిన్న పిల్లలపై లైంగిక అత్యాచారులు జరుగుతున్నాయని పిల్లలు ఎవరు ఏమిచ్చిన తీసుకోకూడదు అనుమానం వస్తే తల్లిదండ్రులు తెలపాలి అని సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి చదివే అని మీ భవిష్యత్తుకు ఉజ్వలంగా ఉండాలని ఉపాధ్యాయులు గట్టిగా బరోస ఇవ్వాలని కోరుకుంటూ చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీ విద్య పాఠశాల కరెస్పాండెంట్ గౌస్ మోదిన్ ఎస్సై. నరేంద్ర కుమార్ రెడ్డి శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులకు ఎస్సై చేతుల మీదుగా మెమొంటో ఇవ్వడం అందించారు. బాల బాలికలు నృత్యాలు సంగీతాలు డ్యాన్సులు అలంకరించాయి.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముబిన మరియు టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు.