చెంచుగూడెముల అభివృద్ధికి కృషి
1 min read– శ్రీశైలం టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్ వై. శ్రీనివాస రెడ్డి
పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని చెంచుగూడెముల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టరు వై. శ్రీనివాస రెడ్డి, ఐ.ఎఫ్. ఎస్.. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు కన్వర్జెన్సీ హాల్లో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి రవీందారెడ్డి, ఐటీడీఏ ఫారెస్టు, ఇతర శాఖల బయోడైవర్సిటీ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెంచుగూడెములలో మంచినీటి పథకముల, గృహ నిర్మాణము, మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద రోడ్ల నిర్మాణము, అటవీ హక్కుల చట్టము, చెంచుగూడెముల విద్యుద్దీకరణ, సి.సి. రోడ్ల నిర్మాణము, బోరు బావుల విద్యుద్దీకరణ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుట గురించి చర్చించారు. ఇందుకు ఆయాశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఫీల్డ్ డైరెక్టర్ వై. శ్రీనివాస రెడ్డి సూచించారు. సమావేశంలో అలెన్ చాంగ తెరను, డివిజనల్ ఫారెస్ట్ అధికారి, ఆత్మకూరు, శ్రీ విగ్నేష్ అప్పావు, డివిజనల్ ఫారెస్టు అధికారి, మార్కాపూర్, శ్రీ సందీప్ రెడ్డి, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి, దోర్నాల, శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి, శ్రీశైలం; శ్రీ మురళీధర్, సహాయ ప్రాజెక్టు అధికారి, ఐ.టి.డి.ఏ, శ్రీశైలం శ్రీమతి పుష్పలత, రీజనల్ డైరెక్టరు, ఆర్.డి.టి., దోర్నాల వారు ఐ.టి.డి.ఏ ఈఈ లతా రెడ్డి, శ్రీ నరసింహులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసరు, శ్రీశైలం, ఐ.టి.డి.ఏ ఏ.ఇ లు జయరాజు, ప్రదీప్, రియాజ్, ఉపాధి హామీ పథక సిబ్బంది శ్రీ పవన్ కుమార్, ప్రాజెక్టు మేనేజరు, స్పెషల్ ఆఫీసర్స్ కె.జి.నాయక్, రామకృష్ణ పాల్గొన్నారు.