గడివేముల హై స్కూల్ అభివృద్ధికి కృషి : పూర్వ విద్యార్థి, మేయర్ బివై రామయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: పాణ్యం నియోజకవర్గం గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు కర్నూలు మేయర్ బివై రామయ్య. మండల కేంద్రమైన గడివేములలో హై స్కూల్ లో 1981-82 సంవత్సరం పదో తరగతి బ్యాచ్ ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, వారికి విద్యా భోదించిన గురువులను సన్మానించారు.
ఇదే బ్యాచ్‌కు చెందిన కర్నూలు నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, స్కూల్లో నాణ్యమైన తరగతి గదులు లేవని , ఈ స్కూల్ నుండీ ఎందరో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అతుణ్యత శిఖరాలు అధిరోహించారాని వారన్నారు. ఇప్పుడు తరగతి గదులు సరిగా లేకపోవడం చింతించదగ్గ విషయమన్నారు. నావంతు కృషిగా ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సహకారంతో డిఈఓ దృష్టికి తీసుకెళ్లి నాడు నేడు సర్వ శిక్ష అభియాన్ నిధుల కింద స్కూల్ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిదుతమన్నారు.
త్వరలో గడివేముల పాఠశాలకు మంచి గుర్తింపు వచ్చేలా రాష్ట్ర స్థాయి క్రీడలు పోటీలను తీసుకొని వచ్చి పెద్ద కార్యక్రమం చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు, నాగేశ్వరావు, పాపారాయుడు, రవి రెడ్డి, షణ్ముఖ రెడ్డి, సలాం, పెద్ద జమాల్ బాషా, అలగనూరు రమణయ్య, లింగారెడ్డి, మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.