కర్నూలు నగర అభివృద్ధికి కృషి …
1 min read
పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్…
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూల్ నగర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం అని పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 45వ వార్డు అశోక్ నగర్ నందు పలు కాలనీల కు చెందిన అభివృద్ధి పనులకు మంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించి పైలాన్ ను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులు 75.70 లక్షలు వెచ్చించి శ్రీనగర్( రూ49 లక్షలు ), అశోక్ నగర్(రూ17 లక్షలు )లలో మురుగు నీటి కాలువలు అభివృద్ధి చేయుటకు మరియు శ్రీకృష్ణ కాలనీ(రూ9.70 లక్షలు) యందు రోడ్డు ఎత్తు పెంచడానికి ఈ నిధులు వినియోగించడానికి అనుమతులు ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ ను మూడు నెలల లోపల తీసుకున్న పనులు పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. స్థానిక ప్రజలు మురళి , ప్రసాద్ తదితరులు స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని రాగా సమస్యలు అన్నియు తీర్చడానికి మరియు నగర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని మంత్రి ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సూపర్డెంట్ ఇంజనీర్ శేషసాయి,డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,45 వార్డు కార్పొరేటర్ మాణక్యమ్మ , ప్రసాద్, మురళీ తదితరులు పాల్గొన్నారు.