క్రీడాభివృద్ధికి కృషి చేయాలి
1 min read– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ. వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీడాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు .శనివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో 8వ రాష్ట్రస్థాయి ఆఖ్యాపాత్య పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఆరోగ్యమే మహాభాగ్యం అందుకోసమే విద్యార్థులను క్రీడాకారులుగా రాణించాలని ఆయన కోరారు. క్రీడలు కlల లు రెండు కళ్ళ వంటివి అన్నారు. క్రీడాభివృద్ధికి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సౌకర్యాలను మరమ్మత్తులు చేసి చక్కగా తీర్చిదిద్ది క్రీడాకారులకు అనువుగా మలచాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కె.జె రెడ్డి మాట్లాడుతూ విస్తరించడం గర్వించదగ్గ విషయమన్నారు. అభివృద్ధికి తమ వంతు సహకరిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి క్రీడలు అవసరమని డాక్టర్ శంకర్ శర్మ న్యాయవాది శ్రీధర్ రెడ్డిలు చెప్పారు.అనంతరం శాంతికి చిహ్నంగా టీజీ వెంకటేష్ పాటు శాంతికపోతాలను ఎగురవేసి జేజేలు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆధ్యాపాధ్యా అసోసియేషన్ సీఈఓ ఆర్ డి ప్రసాద్, సంఘం అధ్యక్షులు బి రామాంజనేయులు, అసోసియేషన్ ప్రతినిధులు నాగరత్నమయ్య పవన్ కుమార్, సంఘ ప్రతినిధులు శ్రీనివాసులు, గంగాధర్, విజయకుమార్ చిన్న సుంకన్న, సురేంద్ర, సూర్యచంద్ర, నాగేశ్వరరావు తో పాటు వివిధ జిల్లాలను మంచిగా వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.