PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధ్యతగా నేర నివారణకు కృషి చేయాలి… జిల్లా ఎస్పీ

1 min read

– జిల్లా పోలీసు అధికారులతో  నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : విధుల పట్ల అందరూ బాధ్యతగా పని చేసి  నేర నివారణకు, నేరాల సంఖ్య తగ్గించేందుకు గట్టి గా పని చేయాలని  జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్  పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ గారు నెల వారీ  నేర సమీక్షా సమావేశం నిర్వహించి  పోలీసు అధికారులతో  మాట్లాడారు.  కర్నూలు , పత్తికొండ , ఆదోని సబ్ డివిజన్ లోని కేసుల గురించి జిల్లా ఎస్పీ గారు  సమీక్షించారు.  ఇయర్ ఎండింగ్ కు రెండు న్నర నెలలు మాత్రమే ఉందని గట్టిగా పని చేయాలన్నారు.గత సంవత్సరంతో పోలీస్తే కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు  గట్టిగా పని చేయాలన్నారు. ఇప్పటి నుండి ప్రతి వారం  పెండింగ్ కేసుల గురించి సమీక్ష చేస్తానన్నారు. చేసే ఉద్యోగం  బాగా చేయాలన్నారు. కోత్తగా ఏమి ఉండదన్నారు. కొందరు బాగా పని చేస్తున్నారన్నారు. ఫలితాలు కూడా వస్తున్నాయన్నారు.ప్రాపర్టీ  ఎంత రికవరీ చేశారు అనే విషయం గురించి అడిగి తెలుసుకన్నారు. యుఐ కేసులు, రోడ్డు భద్రత, ఈ – చలనాలు, ప్రాపర్టీ  రీకవరీ బాగా చేయాలన్నారు. ఆయా పోలీసుస్టేషన్ ల పరిధిలలో  రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగ్గించాలన్నారు.  సిసి కెమెరాల వలన నేర నివారణ ఎంతో ఉపయోగ పడడమేకాకుండా , ఘర్షణల వంటి ఇతర సంఘటనలు జరిగినప్పుడు  కేసులు తప్పు ద్రోవ పట్టకుండా నిజ నిర్దారణ చేసి దర్యాప్తు ను పకడ్బందీగా చేయవచ్చన్నారు. నవంబర్ లో జరిగే లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేందుకు ప్రతి పోలీసుస్టేషన్ నుండి పోలీసు బృందాలు ఏర్పాటు చేసి రాజీ అయ్యే కేసులలో కౌన్సిలింగ్ చేయాలన్నారు. సచివాలయ మహిళా పోలీసులు  గ్రామాలలో గాని, సచివాలయాలలో బాగా పని చేసే విధంగా  సంబంధిత పోలీసు అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. రౌడీ షీటర్స్ ను బైండోవర్ చేసిన తర్వాత ప్రోసిడింగ్స్ తీసుకోవాలన్నారు.  శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా పని చేయాలన్నారు. దీపావళి పండుగ రానున్న సంధర్బంగా జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా బాణసంచా( టపాసులు )నిల్వ ఉంచినా, విక్రయించినా డయల్ 100 పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలన్నారు.సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిల్లో బాణసంచా అమ్మే వారికి లైసెన్స్ అనుమతి ఉందా లేదా  ఎక్కడైనా గోడౌన్ల లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచారా చూసుకోవాలన్నారు.ఎక్కడైనా సీజ్ చేసిన బాణసంచాను పోలీసు స్టేషన్లలో  ఉంచకూడదన్నారు.అవసరమైతే  అగ్నిమాపక  ,రెవిన్యూ శాఖ ల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.ఈ నేర సమీక్షా సమావేశంలో సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ డి. ప్రసాద్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు  శ్రీనివాసులు, వినోద్ కుమార్, యుగంధర్ బాబు మరియు  సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

About Author