PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయితీల ఆదాయ పెంపునకు కృషి..

1 min read

బడికి వెళ్ళని వారిని పంపే బాధ్యత మీదే..

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: గ్రామ పంచాయతీలను ఆదాయ మార్గాల వైపునకు తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు తెలియజేశారు.మంగళవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు వీపనగండ్ల పంచాయితీ కార్యదర్శి పవన్ కుమార్ వారికి  శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల పరిపాలన మరియు పంచాయతీల ఆదాయం పెంపుదల, పంచాయతీలో గ్రామ సర్పంచ్ కు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఉండాల్సిన నియమ నిబంధనలు, పంచాయతీలను ఏ విధంగా పరిపాలన చేయాలి.ఉండాల్సిన రికార్డుల గురించి పవన్ కుమార్ శిక్షణ ఇచ్చారు. గ్రామ పరిపాలన కత్తి మీద సాము వంటిదని గ్రామంలో మీకు పరిష్కారం కానీ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు వస్తే వాటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ఎంపీడీవో మరియు ఈఓఆర్డి ఫక్రుద్దీన్ సిబ్బందికి సూచించారు.అదేవిధంగా మిడుతూరు సచివాలయంలో జరిగిన సిబ్బంది మరియు వాలంటీర్లతో జరిగిన సమావేశంలో బడికి వెళ్లకుండా ఎవరు కూడా ఇండ్ల దగ్గర ఉండడానికి వీలులేదని 5-18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరూ పాఠశాలల్లో ఉండాల్సిందేనని ఒకవేళ ఎవరైనా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వారి ఇంటికి వెళ్లి చదువు పట్ల వారికి అవగాహన కల్పించి పాఠశాలలకు పంపించే బాధ్యత మీదేనని ఎంపీడీవో వారికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ సలీం భాష,జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం సాయి తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author