మరో రెండు నెఫ్రాలజీ యూనిట్ల మంజూరుకు కృషి
1 min read– నెఫ్రాలజీ 4వ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఎంపీ డా. సంజీవ్ కుమార్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాలలో మరో రెండు నెఫ్రాలజీ యూనిట్ల మంజూరుకు ప్రయత్నిస్తానన్నారు ఎంపీ డా. సంజీవ్ కుమార్. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగంలో 4వ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నాయకులతో కలిసి గ్రామ స్థాయిలో కమ్యూనిటీ స్క్రీనింగ్ జరగాలన్నారు.
వైద్యం కంటే.. రోగ నివారణే ఉత్తమమన్నారు. వారానికోసారి ప్రభుత్వ ఆసుపత్రులలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ PN జిక్కి.మేడం మాట్లాడుతూ కర్నూలు మెడికెల్ కాలేజీ నందు 5 విభాగాలలో 9 సూపర్ స్పెషలిటీ సీట్లు సాధించే విషయములో డాక్టర్ సంజీవ్ కుమార్ ఎంతో కృషి చేశారని అభినందించారు. కార్యక్రమంలో GGH సూపరింటెండెంట్, డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. కార్డియాలజిస్ట్, డాక్టర్ చంద్ర శేఖర్ మరియు PG విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.