కలలను కళాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తా
1 min read– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే కలలను, కళాకారులను ప్రోత్సహించేందుకు నిరంతరం సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన టిజివీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీని రాజ్యసభ మాజీ సభ్యులు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిజివీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు భార్గవ్ కుమార్ తోపాటు శ్రీనివాసులు, రజనీ కల్కూర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా చిన్నారులకు డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చేలా భార్గవ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కర్నూల్ నగరంలో కలలను, కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవి కళాక్షేత్రంతోపాటు రాయలసీమ కల్చరల్ అకాడమీ ఏర్పాటు చేశామని వివరించారు. దీనితోపాటు టీ.జీ.వీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా చిన్నారులకు డాన్స్ మరియు సంగీతంలో శిక్షణ ఇవ్వడంతో పాటు వాటిని ప్రదర్శించేందుకు టీజీవి కళాక్షేత్రంలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్తులో టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి సొంత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆయన వివరించారు. తమ పిల్లలను కేవలం చదువుకు పరిమితం చేయకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డంపట్టే శాస్త్రీయ నృత్యం, సంగీతంలలో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అంకితభావం పెంపొందుతాయని చెప్పారు. భవిష్యత్తులో టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందజేస్తానని వివరించారు. ఎంతోకాలంగా కర్నూలు నగరంలో చిన్నారులకు నృత్యంలో శిక్షణ ఇవ్వడంతో పాటు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇప్పించేందుకు కృషి చేస్తున్న టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు భార్గవ్ కుమారును అభినందించారు. ఈ సందర్భంగా టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు భార్గవ్ కుమార్ మాట్లాడుతూ తమకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సహకారంతో కర్నూలు నగరంలో చిన్నారులకు డాన్స్ లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇప్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. కర్నూలు నగరంలో రాజకీయాలు కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కే దక్కిందని ఆయన వివరించారు.