NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగాల భర్తీ కోసం కృషి చేస్తా…

1 min read

పల్లెవెలుగు , వెబ్​ పత్తికొండ: నేడు పత్తికొండ మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ను,ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాలలో,డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను , ఉపాద్యాయులను,ఉద్యాపకులను కలిసి అందరూ ఓటును నమోదు చేసుకోవాలని,నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పశ్చిమ రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు ఓటర్లను అభ్యర్థించారు.నన్ను గెలిపిస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం కృషి చేస్తాను అన్నారు.అలాగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ క్రింద పనిచేస్తున్న ఉద్యోగుల క్రమ బద్దికరణ కోసం నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.బడుగు బలహీనర్గాల అభ్యున్నతికై అవిరళ కృషి చేస్తూ,వారి కష్టాలను,కన్నీళ్లను శాసనమండలిలో నా గొంతుకతో వినిపిస్తానని ఆయన అన్నారు.నా విద్యార్థి జీవితం నుండి నేను అనేక సామాజిక ఉద్యమాలలో పాలు పంచుకున్నానని ఆయన అన్నారు.నన్ను PDF MLC లతో పాటు ,UTF,STU AP ఉపాద్యాయ సంఘాలు,జనవిజ్ఞాన వేదిక,ఉద్యోగ కార్మిక సంఘాలు,మేధావులు బలపరుస్తున్నార నీ ఆయన అన్నారు.ఈయన పర్యటనలో UTF నాయకులు ప్రసాద్ బాబు,చంద్రమౌళి,నరసోజి,నాగేశ్వర రావు,STU నాయకులు సత్యనారాయణ, సుంకన్న,బలరాముడు,వెంకటేశ్వర్లు ,గౌస్ పీర మరియు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

About Author