రోజుకో గుడ్డు.. వెరీ గుడ్ !
1 min readపల్లెవెలుగు వెబ్: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లలు త్వరగా ఇన్ఫెక్షన్, అలర్జీ బారిన పడతారు. కాబట్టి వారిలో రోగనిరోధక శక్తిని పెంచేలా రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వార పిల్లలో ఇమ్యూనిటీ పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. కోడిగుడ్లలో విటమిన్-డి, జింక్, సెలీనియం, విటమిన్-ఇ ఉంటాయి. అందుకే పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. ప్రోటీన్ కూడా సమృద్ధిగా లభించడంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు.