శిథిలావస్థలో ఈద్గా.. పండగ రోజు ముస్లిం మైనార్టీలకు తప్పని తిప్పలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల వ్యాప్తంగా రంజాన్ బక్రీద్ పండుగలకు ముస్లిం సోదరులు సామూహికంగా గ్రామ శివారులో ఉండే ఈద్గాలో పండగ నమాజు చేసుకుంటారు ఎందుకు భిన్నంగా మండల కేంద్రమైన గడివేముల గ్రామ ముస్లిం మైనార్టీ సోదరులకు నందికొట్కూరు రోడ్డులోని గంగమ్మ కట్ట వద్ద శిధిలావస్థకు చేరిన ఈద్గాలో నమాజు చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది గ్రామంలో ముస్లిం జనాభా పెరుగుతున్న దాదాపు 300 గడపలు 600 మంది జనాభా ఉన్న ముస్లింలకు పండగ నాడు ప్రశాంతంగా కూర్చొని నమాజు చదువుకోవడానికి ఈద్గా స్థలం చాలటం లేదు గతంలో మైనార్టీ వక్స్ బోర్డ్ అధికారులకు జనాభాకు అనుకూలంగా వేరే చోట ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరిన ఫలితం లేకుండా పోయిందని ముస్లిం సోదరులు వాపోయారు ఎన్నికల నాడు ఓటర్లుగానే చూడడం ముస్లిం మైనార్టీలకు మండల స్థాయిలో రాజకీయంగా గుర్తింపు లేకపోవడంతో తమ హక్కులు సాధించుకోలేకపోతున్నామని ముస్లిం సోదరులు పేర్కొనడం గమనార్హం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారుుచొరవ తీసుకొని ఈద్గా కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని ముస్లిం మైనార్టీ ప్రజలు కోరుతున్నారు.