NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్

1 min read

రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండలంలోని ముస్లిం సోదరులకు బక్రీద్​ పండగ శుభాకాంక్షలు తెలిపారు రాజంపేట నియోజకవర్గ వై కా పా నాయకులు గాలివీటి విజయసాగర్ రెడ్డి(మదన్ రెడ్డి). మంగళవారం ఆయన మాట్లాడుతూ త్యాగం,సహనం,ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం స్పూర్తితో ప్రజలు సత్యం, న్యాయం, ధర్మం, పరోపకారం, బాధ్యతాభావం అలవర్చుకోవాలని కోరారు. ఆ దేవుడి దయతో కరోనా వైరస్ త్వరగా నశించి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

About Author