NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ కు ఎనిమిదో లేఖ‌.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : న‌ర్సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు సీఎం జ‌గ‌న్ కు ఎనిమిదో లేఖ రాశారు. న‌వ ప్రభుత్వ క‌ర్తవ్యాల పేరుతో సీఎం జ‌గ‌న్ కు వ‌రుస లేఖ‌లు రాస్తున్నారు. స‌ర్పంచ్ అధికారాల్లో కోత విధించ‌డం ప్రజాస్వామ్యానికి చేట‌ని అన్నారు. గ్రామ స‌భ క్రియాశీల‌త్వం కోల్పోయి.. లాంచ‌న‌ప్రాయంగా మారింద‌న్నారు. స‌ర్పంచ్ చెక్ ప‌వ‌ర్ పై స్పష్టత లేక‌పోవ‌డంతో… బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నార‌ని పేర్కొన్నారు. నిధులు లేక అభివృద్ధి ఆగిపోయింద‌ని, పంచాయ‌తీల‌ను ప్రభుత్వమే బ‌ల‌హీన‌ప‌రుస్తున్నార‌న్న భావ‌న ప్రజ‌ల్లో ఉంద‌ని తెలిపారు. ప్రభుత్వ చ‌ర్యల‌ను ప్రజ‌లు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని, ఏదో ఒక రోజు అది బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెప్పారు.

About Author