విశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండే విజయం !
1 min readపల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్లు శాసనసభాపతి రాహుల్ నర్వేకర్ అసెంబ్లీలో ప్రకటించారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. మహారాష్ట్రలో కొత్త ప్రతిపక్ష నాయకుడిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ‘‘షిండే ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. షిండే నమ్మకమైన శివసైనికుడు. అతను బాలాసాహెబ్ సిద్ధాంతానికి విధేయుడు’’ అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు.