PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛ‌నుదారులకు ఈకేవైసీ మే 10 లోపు తప్పనిసరి..

1 min read

– జిల్లా ట్రెజరీ అధికారి అడారి గణేష్
పల్లెవెలుగు వెబ్ భీమవరం : విశ్రాంత ఉద్యోగ ఫించనుదారులందరూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈనెల 10వ తేదీ లోపుగా ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా ట్రెజరీ అధికారి అడారి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం జిల్లాలోని పింఛనుదారులు తన సి.ఎఫ్.ఎం.ఎస్ ఐడికి ఆధార్ కార్డుతో అనుసంధానం అయిన ఫోన్ నెంబర్ ను, ప్రస్తుత నివాస చిరునామాను విధిగా నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. అప్పటి ఫోన్ నెంబరు అందుబాటులో లేని ఎడల ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫోన్ నెంబర్ ను ఆధార్ తో అప్డేట్ చేయించుకోవాలన్నారు. అనంతరం జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలకు లేదా పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయాలకు వెళ్లి ఈకేవైసి చేయించుకోవాల్సిందిగా తెలిపారు. దీనివలన ప్రతి విశ్రాంత ఉద్యోగికి సాంకేతికతతో కూడిన ఆర్థిక భద్రతకల్పించబడుతుందన్నారు.ఈ కేవైసీ పూర్తయితే పింఛన్దారులకు సంబంధించిన ప్రతి సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. కావున పింఛన్దారులు ఈ కేవైసీ నమోదుకు ఉపకజానా అధికారులు భీమవరం – 63026 18446, ఆకివీడు – 95050 53723, నరసాపురం – 73868 59749, పాలకొల్లు – 95050 39748, పెనుగొండ – 99516 02137, తాడేపల్లిగూడెం – 94918 21365, తణుకు – 83412 25044 అధికారులను సంప్రదించాలని జిల్లా ట్రెజరీ అధికారి అడారి గణేష్ ఆ ప్రకటనలో తెలిపారు.

About Author