పరదాల చాటు సీఎంను ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించండి..
1 min readనందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి.
వైసీపీ నుంచి టిడిపిలోకి చేరిక
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పరదాల చాటున పాలన చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించాలని బుధవారం నాడు గడిగరేవుల గ్రామంలో వైసీపీ నుండి టిడిపిలోకి సర్పంచ్ సోదరుడు బిఎస్ రాంభూపాల్ రెడ్డి వార్డు మెంబర్ ప్రసాద్ తో పాటు 50 కుటుంబాలు టిడిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా గౌరు వెంకట్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్చివేతతో మొదలైన జగన్ పాలన యువతకు నిరుద్యోగులుగానే ఐదు సంవత్సరాలు మిగిల్చాడని ఇసుక మద్యం మాఫియాతో వైసీపీ నాయకుల జీవితాలు మెరుగుపడ్డాయని గతంలో హామీ ఇచ్చిన విధంగా పరిశ్రమలు వచ్చిన 70% స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారని ఉద్యోగులకు సిపిఎస్ హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు హక్కుల కోసం గళమెత్తిన వారిపై కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వంలో సర్వ సాధారణమైపోయిందని పరదాల చాటున సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పాణ్యం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి అయిన గౌరు చరితారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని. తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. పంట రామచంద్రారెడ్డి. కృష్ణ యాదవ్ శ్రీనివాస్ యాదవ్. దుర్గా భోగేశ్వరం మాజీ చైర్మన్ శ్రీనివాసులు. గిరిబాబు. సుదర్శన్ రెడ్డి. వంటరామ్ మద్దిలేటి రెడ్డి పంట దిలీప్ రెడ్డి. మండల టిడిపి నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.