ఏపీలో ఎన్నికల నగారా మోగింది !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబరు 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మంగళవారం పేర్కొంది. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి స్థానాలకు, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల స్థానాల్లో అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియకు ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్లను ఈ నెల 23 వరకు స్వీకరించి, 24న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26వరకు గడువు ఉంటుంది. పోలింగ్ డిసెంబరు 10న జరుగుతుంది. ఓట్ల లెక్కింపును డిసెంబరు14న చేపడతారు.