PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల కోడ్ వీరికి వర్తించదా..?

1 min read

– మండల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు -వీరి ప్రవర్తన మారదు మార్చలేరు -గతంలో దేవనూరు పిఎస్ తప్పులపై అధికారుల
పల్లెవెలుగు వెబ మిడుతూరు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చి చాలా రోజులు అయింది.మార్చి నెల 16వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉందని అధికారులందరికీ తెలుసు ఎక్కడ కూడా రాజకీయపరంగా కానీ రాజకీయ నాయకుల ఫోటోలు ఎక్కడ కూడా కనిపించకూడదనీ అవి ఉంటే వెంటనే తొలగించాలని రాష్ట్ర జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎన్నికల ఆదేశాలను వారు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు గ్రామంలో వెల్లువెత్తుతున్నాయి.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని దేవనూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి వై.వీరారెడ్డి(సచివాలయ డిడిఓ)రూటే వేరు అని చెప్పడంలో అవసరం లేదు.ఎందుకంటే ఆయన ఏమి చేసినా పైఅధికారులకు ఇష్టం. గతంలో 5 రోజులపాటు సచివాలయ హాజరు పట్టికలో సిబ్బంది సంతకాలు చేయకపోవడం,సెలవులు తీసుకున్న చోట సెలవులు రాయకపోవడం,సెలవులు రాసినచోట దిద్ది సంతకాలు చేయడం వంటి బహిర్గత విషయాలు గతంలో పత్రికల్లో వచ్చిన సంఘటన పత్రికల్లో వచ్చినా మండల అధికారులు ఆయనపై ఏమి చర్యలు తీసుకోకపోవడంలో లోలోపల ఏమీ మతలబు ఉందోనని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.బుధవారం మధ్యాహ్నం 3:30 నిమిషములకు పల్లెవెలుగు పాత్రికేయులు సచివాలయానికి వెళ్ళగా సచివాలయంలో పది మంది సిబ్బంది ఉండాల్సిన వారు ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తూ ఉండడం పట్ల వారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో నని ఇక్కడ సచివాలయంలో సంతకాలు మాత్రమే చేసి సొంత పనుల నిమిత్తం వెళ్తున్నారని గ్రామ ప్రజలు పంచాయితీ కార్యదర్శి మరియు సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా సచివాలయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోటోలను ఫ్లెక్సీలను తొలగించకపోవడం పట్ల మండల అధికారులు ఏమి చర్యలు చేసుకుంటారో నని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.తర్వాత మండలంలో ఉన్న బియ్యం ట్రక్కులకు ఉన్న ఫోటోలను అధికారులు తొలగించలేదు.ఇప్పటికైనా పైఅధికారులు ఇలాంటి వారితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించే విధంగా చేస్తారా లేక కింద స్థాయి సిబ్బంది విధి నిర్వహణ ప్రవర్తనలో మార్చే విధంగా చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

About Author